సల్మాన్ ఖాన్ తో గత రెండేళ్లుగా చేస్తోంది రొమేనియాకు చెందిన ఉలియా వంతూర్. భారత్ లో ఉన్నప్పుడు ఈ అమ్మడు సల్మాన్ ఇంట్లోనే ఉంటుంది. దీంతో సల్మాన్ రొమేనియా భామను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి.
ఇదిలా ఉంటె ప్రస్తుతం ఉలియా బాలిలో షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్ళింది. అక్కడ ఓ హోటల్ రూమ్ లో ఉండగా సడెన్ గా భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఆ హోటల్ రూమ్ కంపించిపోయింది. హోటల్ రూంలో ఉన్న ఉలియా భయపడింది. ఏం జరుగుతుందో అర్ధంగా ఇబ్బంది పడింది.
కాసేపటికి ఆంతా సర్దుకోవడంతో నెమ్మదించింది. భూకంపాన్ని దగ్గర నుంచి చూసిన ఉలియా దానిపై స్పందించింది. ప్రస్తుతం నేనున్న బాలి ప్రదేశంలో 5.7 తీవ్రతతో భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు ఎన్నో ఆలోచనలు బుర్రలో తిరిగాయి. కానీ నేను దేవుడిపై భారం వేసి మౌనంగా ఉండాలనుకున్నాను. ఎలాంటి చెడు జరగదని నా మనసుకు అనిపిస్తూనే ఉంది. అనుకున్నట్లుగానే దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. కొన్ని క్షణాల్లోనే అంతా సాధారణ స్థితికి వచ్చింది" చెప్తూ వీడియో ను పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సేఫ్ గా ఉండండి అని కొందరు మెసేజ్ చేస్తుంటే.. భగవంతుడు ఉన్నాడు ఎవరికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకున్నాడు అంటు మరికొందరు మెసేజ్ చేస్తున్నారు. మొత్తానికి ప్రమాదం నుంచి ఉలియా సేఫ్ గా బయటపడటంతో సల్మాన్ తో పాటు బాలీవుడ్ చిత్రపరిశ్రమకుడా ఊపిరి పీల్చుకుంది.