ఇస్మార్ట్ శంకర్ కి 'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?

siri Madhukar
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ నెల 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొంత కాలంగా రామ్, పూరి జగన్నాధ్ కి వరుసగా డిజాస్టర్లు ఎదురు కావడంతో సరైన హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఫుల్ లెన్త్ ఎంట్రటైనర్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తీసినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ ఊర మాస్ లుక్‌ తో అదరగొట్టాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటాష్ ఇస్మార్ట్ హైదరాబాద్ పోరీలుగా నటిస్తున్నారు.  జూలై 18న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ అవుతుంది. అంతేకాదు ఎక్కువ ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ వచ్చింది.   ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికేట్ ఇచ్చింది. గతంలో పూరి దర్శకత్వంలో రిలీజ్‌ అయిన దేశముదురు, పోకిరి, బిజినెస్‌మేన్‌ లాంటి సినిమాలు 'A' సర్టిఫికేట్‌తోనే సూపర్‌ హిట్‌ అయ్యాయి. మరి రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఆ సెంటిమెంట్ ఏమైనా వర్క్ ఔట్ అవుతుందా..అదృష్టం బాగుండి హిట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని అంటున్నారు. 

ఈ సందర్భంగా రామ్‌ ఆసక్తికర ట్వీట్ చేశాడు. సినిమాల్లో ప్రారంభమయ్యే ముందు వేసే స్టాట్యూటరీ వార్నింగ్‌ తరహాలో ధూమపానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. అలానే ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ నిజజీవితంలో ఫాలో అవ్వడం కూడా అంతే ప్రమాదకరం అని ట్వీట్ చేశారు రామ్.
 The Censor Board says it’s “A” kickass film! 

Statutory Warning:

Cigarette Smoking, Consumption of Alcohol and Following #iSmartShankar in real life are injurious to health.

Be ismart enough to realise that he’s “A” fictional character.. #love
-R.A.P.O pic.twitter.com/yLIexKL4JV

— Ustaad iSmart Shankar (@ramsayz) July 16, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: