'ఇస్మార్ట్ శంకర్' లో 'ఆ' సీన్ లే హైలైట్ ?
అంతేకాకుండా ఈ సినిమాకి పూరి జగన్నాథ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న క్రమంలో...ఇటీవల సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చాలా వినూత్నంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ నేపథ్యంలో...సినిమాలో హీరో రామ్ పాత్ర తెలంగాణ యాసలో ఉంటున్న క్రమంలో… వరంగల్ లో ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్ కార్యక్రమాలను అదిరిపోయే రీతిలో స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఫిలింనగర్ లో తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఏమిటంటే సినిమాలో మెయిన్ హీరోయిన్ నిధి అగర్వాల్ కంటే కూడా నభా నటేష్ పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. బూతు మాటలు మాట్లాడడమే కాకుండా రెచ్చిపోయి అందాల ప్రదర్శన కూడా చేసిందట. ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ పాత్ర ఎంత మాస్‌గా వుంటుందో అంతకు మించి నభా క్యారెక్టర్ వుంటుందని, ఈ చిత్రం ఫలితం ఏదయినా కానీ నభా నటేష్‌కి మాత్రం ఫుల్ అటెన్షన్ లభిస్తుందని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.