బిగ్ బాస్ 3 లో హాట్ హీరోయిన్ దిగుతోంది చూసుకోండి మరి !
గతంలో ఈ షోలో హాట్ యాంకర్ శ్రీముఖి వెళ్తుందన్న వార్త బయటకు రాగా తాజాగా ఈ హాట్ యాంకర్ కి పోటీగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా గ్లామర్ అమ్మాయి గా క్రేజ్ తెచ్చుకున్న హేబా పటేల్ కూడా బిగ్ బాస్ 3 షో లోకి అడుగు పెట్టబోతున్నట్లు...హౌస్ లోకి తీసుకెళ్లడానికి షో నిర్వాహకులు హేబా పటేల్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
దీంతో ఒకే షో లో శ్రీముఖి లాంటి హాట్ యాంకర్,అలానే హెబ్బా పటేల్ లాంటి గ్లామర్ డాల్ కనిపిస్తే ఇక బుల్లితెర ప్రేక్షకులు ఊరుకుంటారా. పండగే పండగ చేసుకోరు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హెబ్బా బుల్లి తెరపై కనిపిస్తుంది అన్న మాటే యూత్ లో ఒక మంచి హుషారు నింపే అవకాశం ఉంటుంది. మొత్తం మీద తాజాగా జరగబోయే బిగ్ బాస్ 3 లో షో నిర్వాహకులు హాట్ హాట్ అందాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.