అవకాశం వస్తే బాహుబలి ౩ లో నటిస్తానంటున్న
తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గౌరవం తీసుకొచ్చిన సినిమా బాహుబలి. ఒక్కసారిగా ప్రపంచ సినిమా మొత్తం తెలుగు సినిమా వైపు చూసింది. తెలుగు సినిమా ఇన్ని వసూళ్ళు సాధిస్తుందా అని అందరూ అశ్చర్యపోయేలా కలెక్షన్లను వసూలు చేసింది.
అటువంటి సినిమాలో నటించడానికి ఎవరు మాత్రం కాదంటారు. పెద్ద పెద్ద తారలు సైతం బాహుబలి లో నటిస్తే వచ్చే పాపులారిటీ కోసం తాము కూడా అందులో ఒక భాగం కావాలని ఆశపడ్డారు.
తాజాగా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా తన మనసులో మాటని బయటపెట్టింది. బాహుబలి లాంటి మాగ్నం ఓపస్ చిత్రాల్లో తనకి నటించాలని ఉందని మీడియాకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది.
గతంలో రాజమౌళి బాహుబలి ౩ కూడా ఉంటుంది అని సంకేతాలు ఇచ్చాడు. కాని అది ఎంతవరకు నిజమవుతుందీ అన్నది చూడాలి. ఏది ఏమైనా ఒకవేళ బాహుబలి ౩ తీస్తే అది ఇంకొక చరిత్ర అవుతుందని మాత్రం చెప్పవచ్చు.