ఒక సన్నివేశం బాగా రావాలి అంటే దానికోసం కష్టపడి ఇష్టపడి పనిచేయాలి. అప్పుడే ఆ సన్నివేశం అద్భుతంగా వస్తుంది. ఇలాంటిదే ఇప్పుడు జరిగింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ వచ్చింది. ఇందులో అనస్య పాండే హీరోయిన్.
ఇందులో ఓ సన్నివేశం ఉంది. చాల ప్రమాదంతో కూడుకున్న సీన్ అది. అయినప్పటికి ఆమె దాన్ని అద్భుతంగా చేసింది. కారు వెళ్లి చెట్టుకు ఢీకొట్టాలి. అది సీన్స్... అనుకున్నట్టుగానే అంతా రెడీ అయ్యింది. కారు వెళ్లి చెట్టును డీ కొట్టింది.
అయితే ఈ సీన్ లో కారు స్లో గా వెళ్లి ఢీ కొట్టాలి. కానీ, స్పీడ్ గా వెళ్లి చెట్టును గుద్దటంతో కారు డ్యామేజ్ అయ్యింది. అంతేకాదు, ముందున్న ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి. అయినా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అయితే, అక్కడికి హీరోతో పాటు యూనిట్ పరిగెత్తుకుంటూ వచ్చారు.
కానీ, కారు ఎక్కడ పేలుతుందో అని చెప్పి పరుగులు తీశారట. అనస్య ఎలాగో కష్టపడి బయటకు వచ్చింది. చాలా కష్టపడి రిస్క్ తీసుకొని చేసిన ఈ సీన్ ను ఎడిటింగ్ లో తీసేసినట్టు అనస్య పేర్కొంది. ఇలా చేయడం చాలా రిస్క్ కదా మరి. ఎంతైనా రియాలిటీ గా ఉంటూనే బాగుంటుంది.