ఈ మద్య సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్‌గా ఉన్నవారిలో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది. ఆయన సహనటులు అమీర్, షారూఖ్ ఖాన్ ల వివాహం కావడమే కాదు..వారి వారసులు కూడా తెరంగెట్రం చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఎన్నో ఈవెంట్స్ లో సల్మాన్ ఖాన్ వివాహం పై చర్చలు వచ్చినపుడల్లా ఎదో ఒక రీజన్ చెప్పి ఆ మ్యాటర్ క్లోజ్ చేస్తాడు. తెలుగు లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు ప్రభాస్, రానాల ప్రస్థావన వస్తుంది. గత కొన్నేళ్లుగా కోలీవుడ్‌లో బ్యాచిలర్‌గా ఉన్న యువ హీరోలందరికీ వరుసగా వివాహాలు అవుతున్నాయి.
కోలీవుడ్ స్టారో హీరోలు ఆర్య, విశాల్, శింబు వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందా అని ఆతృతగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే గత నెల ఆర్య తన సహనటి సాయిషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే నెల విశాల్ కూడా హైదరాబాద్ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. మొత్తానికి ఇద్దరు హీరోలు లైన్ లో పడ్డారు..మరి మిగిలింది శింబు మాత్రమే. హీరో శింబు విషయానికి వస్తే..కెరీర్ ప్రారంభంలో అందాల తార నయనతార లవ్ లో పడ్డాడు..వీరిద్దిరి ప్రేమాయణం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.
ఆ తర్వాత నయనతారతో బ్రేక్ అయ్యింది. హన్సికలతో జరిపిన ప్రేమాయణం కొనసాగించాడు..వీరి మద్య వివాదాలు చోటు చేసుకోవడంతో శింబు చాలా ఏళ్లుగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం శింబు తమ్ముడు కురలరసన్ వివాహం ఈ నెలాఖరులో జరగనుంది. తమ్ముడు పెళవుతుంది..మరి అన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా..అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు.