సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ.. మహేష్ 'మహర్షి' టీజర్ అదుర్స్..!

shami
సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గుర్ బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.


మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ ఉగాది సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. కొద్ది నిమిషాల క్రితం రిలీజైన మహర్షి టీజర్ లో మహేష్ డైలాగ్స్ అదిరిపోయాయి.  సక్సెస్ లో ఫుల్ స్టాప్ లు ఉండవ్.. కామాస్ మాత్రమే.. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ.. అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.


అంతేకాదు నువ్వు ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు.. టీజర్ లో అదరగొట్టేసిన ఈ డైలాగ్స్ తో పాటుగా మహేష్ స్టైలిష్ లుక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. సినిమాలో మహేష్ పాత్రలో వేరియేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే టీజర్ లో మహేష్ ను మాత్రమే చూపించి అసలు స్టోరీ దాచేశారు.


మాస్ ఆడియెన్స్ కోరుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని టీజర్ లోనే తెలుస్తుంది. మరి ఈ రిషి అదేనండి మన మహర్షి జర్నీలో మనం కూడా జాయిన్ అవ్వ్వాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే. వంశీ పైడిపల్లి ఈ సినిమా మీద చాలా హోప్స్ తో ఉన్నాడు. మరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: