వెబ్ సిరీస్ అంటే ఛాన్సే లేదని తేల్చేసిన విజయ్ దేవరకొండ..!
అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను మరియు తెలుగు యువత అభిమానం అందుకున్న విజయ్ దేవరకొండ ఒక్క తెలుగులోనే కాక సౌత్ ఇండస్ట్రీలో తన మార్కెట్ పెంచుకుంటూ ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లో చాలామంది నటులు సందడి చేస్తున్న క్రమంలో విజయ్ దేవరకొండ మాత్రం డిజిటల్ మీడియంకు నో చెప్పేశాడు. తనని తాను బుల్లితెర చూసుకోవటం ఇష్టం లేదన్న విజయ్, ఎప్పటికీ వెబ్ సిరీస్లో నటించనని చెప్పేశాడు. అయితే భవిష్యత్తులో వెబ్ సిరీస్ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న విజయ్ ఈ కామెంట్స్ చేశాడు.