లోదుస్తులు లేకుండా ఫోటోలు తీశారు ..!

Prathap Kaluva

కంగనా రనౌత్ బాలీవుడ్ సెన్సేషన్. ఏదైనా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది. ఎవరి మీద నైనా విమర్శలు చేయగల ధైర్యం ఉన్న హీరోయిన్. ఎలాంటి విషయం గురించి అయినా కంగనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. వివాదాలు వెంటాడుతున్నా నటిగా కంగనా దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా తన కెరీర్ ఆరంభంలో జరిగిన సంగతుల గురించి వివరించింది. 


ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్లకు ఇబ్బందులు తప్పవు. ఆడిషన్స్ లో దర్శకులని, నిర్మాతలని మెప్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అవకాశాలు ఇస్తారు. ఆడిషన్స్ పేరుతో వర్థమాన నటీమణులు లైంగికంగా వేధిస్తున్నారు అంటూ గతంలో కాస్టింగ్ కౌచ్, మీటూ అంశాలపై ఉద్యామాలు జరిగిన సంగతి తెలిసిందే. కనగానా రనౌత్ మాట్లాడుతూ తాను తొలి చిత్రం కోసం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నానో వివరించింది.


బాలీవుడ్ ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహ్లానీ తాను నిర్మించే 'ఐ లవ్యూ బాస్' అనే చిత్రానికి ఫోటో షూట్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో తనకు అవకాశం ఇస్తానని, ఫోటో షూట్ కోసం రావాలని కోరారు. ఫోటో షూట్ లో ఎలాంటి లోదుస్తులు లేకుండా పైనుంచి కిందివరకు ఉండే పలచటి వస్త్రాన్ని ధరించాలి. ఆ వస్త్రంతోనే ఫోటో షూట్ చేశారు. అది ఒకరకంగా శృంగార భరిత చిత్రం. వాళ్ళు చెబుతున్న విధంగా ఫోటో షూట్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డా. నేను హీరోయిన్ గా నటిస్తానంటే నా తల్లిదండ్రులు ఎంతగా భయపడ్డారో, ఆ భయం నాకు ఫోటో షూట్ చేస్తున్నప్పుడు అనిపించింది అని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: