అవసరమైతే రాజకీయాల్లోకి వస్తా : వరలక్ష్మీ

Edari Rama Krishna
ఈ మద్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస ఛాన్సులు కొట్టేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది వరలక్ష్మీ శరత్ కుమార్.  ఒకప్పుడు హీరోగా, విలన్ గా మెప్పించి ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్న శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్.  మొదట హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినా..ప్రస్తుతం ఎలాంటి క్యారెక్టర్ అయినా పరవాలేదు అంటుంది. ఆ మద్య పందెం కోడి2, సర్కార్ చిత్రాల్లో విలన్ పాత్రల నటించి మెప్పించింది. సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో సైతం నటిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ పలుమార్లు సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తానిప్పుడు రాజకీయాలపై ఆసక్తిని పెంచుకుంటున్నానని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తానని చెబుతోంది దక్షిణాది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. 'కన్నిరాశి; 'వెల్వట్‌ నగరం', 'నీయా 2', 'కాట్టేరి' తదితర తమిళ చిత్రాలతో పాటు తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌'లోనూ నటిస్తోంది.

ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె, రాజకీయాల్లోకి వస్తానని, అయితే అందుకు ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పుకొచ్చింది.  ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని..ఆత్మరక్షణ విద్యలను అమ్మాయిలు నేర్చుకోవాలని అభిప్రాయపడిన వరలక్ష్మి, ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాలే చక్కని వేదికని, అవేమీ చెడ్డ విషయాలు కాదని చెప్పింది. తన తండ్రి పార్టీకి, తనకు సంబంధాలు లేవని వ్యాఖ్యానించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: