అల్లు అర్జున్ పై మెగా అభిమానుల ఆగ్రహం !

Seetha Sailaja
నాని విక్రమ్ కుమార్ ల కొత్త మూవీ ప్రాజెక్ట్ కు 'గ్యాంగ్ లీడర్' అన్న టైటిల్ ఫిక్స్ కావడంతో మెగా అభిమానులకు ఆశ్చర్యం కలిగిన విషయం తెలిసిందే. అయితే ఇంత ఆశ్చర్యంలోను మెగా అభిమానులు ఈవిషయంలో అల్లు అర్జున్ పై కోపంగా ఉండటం మరింత ఆశ్చర్య కరంగా మారింది. 

ఇలా మెగా అభిమానులకు బన్నీ పై నాని సినిమా టైటిల్ విషయమై కోపం రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. వాస్తవానికి దర్శకుడు విక్రమ్ కుమార్ నానీతో తీస్తున్న ఈ కథను ముందుగా బన్నీకి చెప్పడమే కాకుండా బన్నీ సూచనలతో ఈకథ విషయంలో అనేక మార్పులు చేర్పులు చేసాడు. 'గ్యాంగ్ లీడర్ అన్న టైటిల్ ఈకథకు పెడితే బాగుటుంది అనీ అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ కు స్వయంగా సూచించినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈకథలో హీరో ఐదుగురు స్త్రీల వెనుక కీలక పాత్ర పోషించే వ్యక్తి.కథ . 8 ఏళ్ళ పాపతో మొదలై 22 ఏళ్ళ అమ్మాయి 50 ఏళ్ళ నడివయస్కు రాలు 80 సంవత్సరాల వృద్ధ మహిళల చుట్టూ ఈమూవీ కథ నడుస్తూ వీరందరి జీవితాలను ప్రభావితం చేసే హీరో పాత్రలో నాని నటిస్తున్నాడు. 

ఈమూవీ కథ ఒక కొరియన్ మూవీని ఆధారంగా చేసుకుని విక్రమ్ కుమార్ ఈ కథను అల్లినట్లు తెలుస్తోంది. మహిళా సాధికారిత చుట్టూ అల్ల బడ్డ ఈకథలో మహిళల సమస్యలు విక్రమ్ కుమార్ చాలా చాకచక్యంగా టచ్ చేసినట్లు టాక్. అయితే కథ అంతా నచ్చింది అనీ చివరివరకు బన్నీ విక్రమ్ కుమార్ ను తన చుట్టూ తిప్పించుకునీ ఆఖరి నిముషంలో హ్యాండ్ ఇవ్వడంతో విక్రమ్ కుమార్ చాలా తెలివిగా ఇదే కథను నానీకి చెప్పి ఒకే చేయించుకోవడమే కాకుండా తనకు బన్నీ సూచించిన 'గ్యాంగ్ లీడర్ టైటిల్ నానీకి ట్రాన్సఫర్ చేయడం వెనుక పరోక్షంగా బన్నీ హస్తం ఉంది అంటూ మెగా అభిమానులు అల్లు అర్జున్ పై  తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: