సినిమా అట్టర్ ఫ్లాప్.. ట్విట్టర్‌ ఎకౌంట్‌ క్లోజ్‌ చేసిన హీరో..?

Chakravarthi Kalyan
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా కమెడియన్ గా బాగా పాపులరైన రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేశాడు. ఈయన మరో కమెడియన్ ప్రియదర్శితో కలసి నటించిన మిఠాయి చిత్రం ఇటీవల విడుదలైంది. మొదటి రోజునే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.



ఈ చిత్రం ఘోరపరాజయంపై రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఈ చిత్రం నిరాశపరిచినందుకు తన అభిమానులకు క్షమాపణలు చెప్పేశాడు. ఈ సినిమాను కాపాడేందుకు చివరి నిమిషం వరకూ తాము ప్రయత్నించామని అవేమీ ఫలించలేదని కామెంట్ చేశాడు.



మరో మంచి చిత్రంతో మీ ముందు వస్తామని ప్రకటించాడు. పాపం.. సినిమా విడుదలైన వెంటనే ఈ స్థాయిలో సారీ చెప్పుకున్నా నెటిజన్లు మాత్రం రాహుల్ రామకృష్ణను కరుణించలేదు. దారుణంగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. భయంకరమైన కామెంట్లు పెట్టారు.



దీంతో ఈ గోల భరించలేక రాహుల్ రామకృష్ణ తాత్కాలికంగా ట్విట్టర్ ఎకౌంట్ క్లోజ్ చేశారు. పెళ్లి చూపులు ద్వారా కమెడియన్ గా పాపులరైన ప్రియదర్శికి కూడా ఈ మిఠాయి చేదు అనుభవమే. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి..ఇద్దరూ టాలెంటెడే.. మరో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూడటం మినహా వీరు ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: