పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!

siri Madhukar

భారత సైనికులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కొంత కాలంగా సైనుకులను లక్ష్యంగా చేసుకొని పలు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పుల్వామా లో భారత సైన్యంపై ఆత్మాహుతి దాడి జరిగింది..ఈ మారణ హోమంలో 43 మంది జవాన్లు అమరులయ్యారు. పుల్వామా దాడిని అఖండ భారతా వని ముక్తకంఠంతో ఖండిస్తోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అమరజవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు.


కాశ్మీర్ అంశంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పుల్వామాలో ఉగ్రదాడిపై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అక్కడి ప్రజలు కోరుకున్నట్టుగానే అక్కడ చేయాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా కశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. కమల్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది.


పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా ఆయన ఆజాద్ కశ్మీర్ అన్నారు. కమల్‌ వ్యాఖ్యలతో ఇంటాబయటా రచ్చ జరగడంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. కమల్‌ వ్యాఖ్యలను కావాలని కొందరు వక్రీకరించారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ ఆరోపించింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని... మన జవాన్లకు అండగా పార్టీ ఉంటుందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: