చరణ్ తీరు పై చిరంజీవితో గగ్గోలు పెడుతున్న నిర్మాతలు ?

Seetha Sailaja
సంక్రాంతి రేసుకు విడుదలైన ‘వినయ విధేయ రామ’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఆమూవీని కొనుక్కున్న బయ్యర్లకు కొంతవరకు ఆర్ధిక సహాయం చేసిన రామ్ చరణ్ వ్యవహార శైలి ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖ నిర్మాతలకు నచ్చలేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో కొంతమంది ప్రముఖ నిర్మాతలు ఒక టీమ్ గా ఏర్పడి ఈమధ్య చిరంజీవిని కలిసి చరణ్ వ్యవహార శైలి పై తమ అసంతృప్తిని వ్యక్త పరిచినట్లు టాక్.

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘వినయ విధేయ రామ’ ఘోరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈమూవీకి 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల అంచనా. దీనితో ఈమూవీకి 65 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చాయని దీనినిబట్టి చూసుకుంటే 95 కోట్ల బిజినెస్ జరిగిన ఈమూవీకి 30 కోట్ల మించి నష్టాలు లేవని చిరంజీవిని కలిసిన ఆనిర్మాతల వాదన. 

దీనితో సినిమా వ్యాపారానికి సంబంధించి 30 శాతం నష్టాలు సర్వసాధారణం అనీ ఇలాంటి నష్టాలను కూడ తీర్చడానికి హీరోలు ముందుకు వస్తే నిర్మాతలు కూడ ముందుకు రావలసి వచ్చి సంవత్సరంలో విడుదలైన అనేక సినిమాల ఫెయిల్యూర్ కు డబ్బులు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వారు చిరంజీవికి వివరించినట్లు టాక్. దీనితో టాప్ హీరోలకు భారీ పారితోషికాలు ఇస్తూ భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు బయ్యర్లకు ఏర్పడిన నష్టాలను కూడ తీర్చాలి అంటే ఎక్కడ నుంచి తెచ్చేది అంటూ ఆ నిర్మాతలు చిరంజీవిని ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ అనుకోని రాయబారానికి షాక్ అయిన చిరంజీవి ‘వినయ విధేయ రామ’ బయ్యర్స్ ను ఆదుకోవడంలో చరణ్ ఉద్దేశాలు వేరనీ తన వల్ల ఏవ్యక్తి నష్టపోకూడదు అన్న ఉద్దేశ్యంతో చరణ్ ఈ పని చేసి ఉంటాడు అని వివరిస్తూ తనను కలిసిన నిర్మాతల అసహనాన్ని చల్లార్చడానికి ప్రయత్నించినట్లు టాక్. దీనితో చరణ్ చేసిన సహాయం ‘వినయ విధేయ రామ’ బయ్యర్లకు సంతోషాన్ని ఇస్తే ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖ నిర్మాతలకు అసహనాన్ని కలిగించిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: