చరణ్ సూచనకు బోయపాటి తిరస్కరణ ?

Seetha Sailaja
కొద్ది రోజుల క్రితం ‘వినయ విధేయ రామ’ ఫెయిల్ అయినందుకు బాధపడుతూ ఈమూవీ ద్వారా తన అభిమానులను మెప్పించలేకపోయాను అన్న విషయాన్ని బాధతో అంగీకరిస్తూ రామ్ చరణ్ వ్రాసిన ఓపెన్ లెటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో చరణ్ నటించిన చాల సినిమాలు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నా ఎప్పుడూ చరణ్ ఇలా ఓపెన్ గా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. 

అంతేకాదు ‘వినయ విధేయ రామ’ విజయం కోసం ఈమూవీ యూనిట్ అంతా బాగా కృషి చేసింది అంటూ తన లెటర్ లో చెప్పిన చరణ్ దర్శకుడు బోయపాటి పేరును పేర్కొంటూ అతడు పడిన కష్టాన్ని వివరించకపోవడం బోయపాటికి తీవ్ర అసహనం కలిగించింది అన్న వార్తలు కూడ వచ్చాయి. ఈ పరిస్థుతులకు కొనసాగింపుగా చరణ్ ‘వినయ విధేయ రామ’ మూవీని కొనుక్కుని నష్టపోయిన బయ్యర్లకు 15 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని చరణ్ దానయ్యకు సూచించడమే కాకుండా ఈ 15 కోట్లు తనతోపాటు నిర్మాత దానయ్య దర్శకుడు బోయపాటి సమానంగా భరిద్దామని చరణ్ నిర్మాత దానయ్యకు సూచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో నిర్మాత దానయ్య ఈవిషయం పై దర్శకుడు బోయపాటిని సంప్రదించినప్పుడు బోయపాటి ఈసూచనకు తన తిరస్కరణ చెప్పడమే కాకుండా ఈమూవీ నష్టానికి సంబంధించి తాను ఆ స్థాయిలో తాను తీసుకున్న పారితోషికం నుంచి తిరిగి ఇవ్వలేను అని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. బోయపాటి నుండి వచ్చిన ఈ అనుకోని సమాధానానికి నిర్మాత దానయ్య షాక్ అయినట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా చరణ్ ‘వినయ విధేయ రామ’ గురించి విడుదల చేసిన లెటర్ విషయం కనీసం తనకు ఒక్కమాట కూడ చెప్పలేదని బోయపాటి బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా జయాపజయాలు ఏ ఒక్కరి చేతిలోనూ ఉండవని ఆవిషయాలను గ్రహించకుండా ‘వినయ విధేయ రామ’ ఫెయిల్యూర్ అంతా తన ఖాతాలో వేయడం అన్యాయం అంటూ బోయపాటి గగ్గోలు పెడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: