ప్రభాస్ కృష్ణంరాజుల మధ్య దూరం పెంచుతున్న ఆ మాటలు ?

Seetha Sailaja
కృష్ణంరాజు నట వారసుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రభాస్ ప్రస్తుతం కృష్ణంరాజు తరుచూ తన పెళ్లి పై చేస్తున్న కామెంట్స్ కు తీవ్ర అసహనంలో ఉన్నట్లు ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది. కృష్ణంరాజు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ప్రభాస్ పెళ్ళి గురించి ప్రశ్నలు రావడం ఆ ప్రశ్నలకు ఎదో ఒక సమాధానం చెప్పడం ఒక రొటీన్ గా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య కృష్ణంరాజు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సాహో’ రిలీజ్ తరువాత ప్రభాస్ పెళ్ళి జరుగుతుందని ఒక అందమైన అమ్మాయి కోసం తాను వెతుకుతున్నానని అంటూ కామెంట్స్ చేసాడు. అయితే కృష్ణంరాజు యదా లాపంగా అన్న మాటలు ప్రభాస్ కు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించినట్లు టాక్. 

దీనితో తన అసహనాన్ని తన పెదనాన్న కృష్ణంరాజు దగ్గర షేర్ చేసుకుంటూ భవిష్యత్ లో కృష్ణంరాజు ఇచ్చే ఇంటర్వ్యూలలో తన పెళ్ళి గురించి ప్రశ్నలు ఎదురైనా తనకు తెలియదు అని సమాధానాలు చెప్పమని ఫలానా సినిమా తరువాత తన పెళ్ళి ఉంటుంది అని మాత్రం అనవద్దు అంటూ సూచనలు ఇచ్చినట్లు టాక్. అంతేకాదు తన సినిమాల గురించి అదేవిధంగా తన చిన్న తనం గురించి ఎవరికీ తెలియని విషయాల గురించి మీడియా ఇంటర్వ్యూలలో చెప్పమని మీడియా వర్గాలు ఎంత రెచ్చ గొట్టినా తన పెళ్ళి గురించి మాత్రం ఎటువంటి లీకులు ఇవ్వవద్దని తన పెదనాన్నకు ప్రభాస్ సలహాలు ఇచ్చినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

ఈవార్తలలో నిజం ఎంత అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా నిరంతరం వార్తలలో కొనసాగుతున్న ప్రభాస్ తన పెళ్ళి గురించి ఇదే తీరు కొనసాగిస్తే మరికొన్ని సంవత్సరాలలో దక్షిణాది సల్మాన్ ఖాన్ గా ప్రభాస్ కు కొత్త ట్యాగ్ ఏర్పడే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: