ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతి విషయంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడం పరిపాటైంది.   గత కొంత కాలంగా తన చిత్రాల విషయంలో చేస్తున్న ప్రమోషన్ చిత్ర విచిత్రంగా ఉంటుంది.  ప్రస్తుతం రాంగోపాల్ వర్మ  నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించి ఏదో ఒకటి చెబుతూ నిత్యమూ వార్తల్లో ఉంటున్నారు. 

ఆ మద్య రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ ఎన్నో కాంట్ర వర్సీలు సృష్టించాయి.  ఇక ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో ఫోటో రిలీజ్ చేస్తూ దానిపై కామెంట్స్ చేస్తున్నారు. 

తాజాగా రామ్ గోపాల్ వర్మ తన అభిమానుల ముందుకు ఓ ప్రశ్నను తీసుకు వచ్చారు. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరూ ఎవరో చెప్పుకోవాలని అడుగుతూ, చిత్రంలో ఎన్టీఆర్ పాత్రధారి దీర్ఘాలోచనలో ఉండగా, వెనుకవైపు చంద్రబాబు పాత్రధారి ఉన్నట్టు కనిపిస్తోంది.  కాగా రాంగోపాల్ వర్మ ట్విట్ కి రక రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
Guess who these two characters are from #LakshmisNTR ? pic.twitter.com/9lC5i4sQVj

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: