బాత్‌ టబ్‌లో నగ్నంగా హన్సిక.. బాబోయ్ ఇదేం పోస్టర్..?

Chakravarthi Kalyan

తెలుగులో పెద్దగా సినిమాల్లేక తమిళానికే పరిమితమైన హన్సిక.. ఇటీవల తరచూ వివాదాల్లోకి వస్తోంది. ఇటీవలే సాధువుల దుస్తులు వేసుకుని సిగరెట్ తాగుతున్న హన్సిక పోస్టర్ కలకలం సృష్టించింది. దీనిపై సాధు సంఘాల నుంచి నిరసనలు వచ్చాయి. కేసులూ నమోదయ్యాయి.


ఐనా.. హన్సిక ఏమాత్రం తగ్గేటట్టు లేదు. తాజాగా ఆమె మరో పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ హారర్ సినిమాను తలపించేలా ఉంది. బాత్ టబ్‌లో హన్సిక నగ్నంగా పడుకుని ఉంటుంది. అయితే ఆ బాత్ టబ్‌లో నీళ్లకు బదులు రక్తం ఉంటుంది.


చాలా హారర్ సినిమాలు వచ్చాయి కానీ.. ఇలా పూర్తిగా రక్తపు మడుగులో హీరోయిన్‌ను స్నానం చేయించేంత దారుణంగా గతంలో ఎన్నడూ పోస్టర్లు రాలేదు. ఇది హన్సిక నటిస్తున్న మహా చిత్రం పోస్టర్. మరి మహా చిత్రాన్ని హారర్ చిత్రంగా ఫోకస్ చేయదలుచుకున్నట్టున్నారు నిర్మాతలు.


మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. బొద్దుగా ముద్దుగా ఉండే హన్సిక ఇకపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోందట. అంతే కాదు.. ఇకపై గ్లామర్ చిత్రాలకు దూరంగా ఉండాలనుకుంటోందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: