తెలుగు బుల్లితెరపై తన యాంకరింగ్ తో అందరినీ అలరిస్తున్న సుమా కనకాల నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ భేటీ అయ్యారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురు వేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో సారి ప్రదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
అయితే కేటీఆర్ కి ఇప్పటి కే పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగానికి చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ ఉదయం ప్రముఖ యాంకర్ సుమ, కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిన్న బోయపాటి శ్రీనివాస్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమా కనకాల, కేటీఆర్ ని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సందర్భంగా కేటీఆర్‌కు సుమ ఒక మొక్కను బహుకరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బాగుందని సుమ ప్రశంసించారు.
ఈ విషయం గురించి సుమ ను మీడియా ప్రశ్నించగా..ఓ మంచి పని కోసం కెటిఆర్ సహాయం అడిగినట్లు సుమ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమయం వచ్చినప్పుడు చెబుతానని ఆమె అన్నారు.