హాట్ ఫోజులతో ఓ రేంజిలో కేక పెట్టిస్తున్న దిశా పటాని చాలా విషయాలనే చెబుతోంది. సినిమా రంగంలో హీరోయిన్ గా ఆమె అనుభవం ఆమె చేత ఇలాంటి విషయాలను మాట్లాడిస్తుందనుకోవాలి. సినిమా రంగం అంటేనే అంత అంటూ దిశా పటానీ ఇస్తున్న భారీ స్టేట్మెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇంతకీ ఈ అమ్మడు ఏమన్నాదంటే హీరోయిన్గా ఎస్టాబ్లిష్ కావాలంటే ఫొటోషూట్లు తప్పనిసరి. అందుకోసం ఫొటోలు దిగుతుంటే.. అందులో ఒక యాంగిల్నే కొందరు చూస్తున్నారు. ఫొటోషూట్‌లో పాల్గొనే ముందు నాకు కెమెరా మాత్రమే కనిపిస్తుంది. ఆ టైమ్‌లో నా ఎదురుగా ఉన్నవారిని కూడా పట్టించుకోను. ఇక ఇక్కడ సిగ్గు గురించి ఆలోచిస్తే.. ఈ ఫీల్డ్ గురించి అసలు ఆలోచించకూడదు. అసలీ ఫీల్డ్‌లోకి రాకూడదు. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదు..’’ అంటూ చెప్పుకొస్తోంది. . ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా దర్శనమివ్వడంపైనా దిశా క్లారిటీ ఇచ్చింది. తాను ఎపుడూ హద్దులు మీర్లేదని కూడా దిశా అంటోంది.
ఇక చక్కని అందంతో పాటు, తెలివితేటలు కూడా పుష్కలంగా ఉన్న దిశా పటానీ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తూ మెల్లగా సెట్ అయింది కానీ సౌత్ లో పెద్దగా ఆఫర్లు రావడంలేదు. దీని మీద కూడా ఆమె స్పందిస్తూ తొందరలోనే తానొక తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెబుతోంది. మరింకేం, కుర్ర కారు కాచుకుని కూర్చోవచ్చు ఆమె కొత్త సినిమా కోసమన్న మాట. మొత్తానికి దిశా హాట్ పిక్స్ తోనే కాదు, ఘాటు కామెంట్లతోనూ సంచలనం రేపుతోంది.