అదే ప్రభాస్ అతి పెద్ద వీక్ నెస్.. రానా కంటే ముందే పెళ్లి..!?
ప్రభాస్ పెళ్లెప్పుడు.. సినీ ఇండస్ట్రీలో ఇదో హాట్ టాపిక్. కానీ ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. ఐతే.. ప్రభాస్ కంటే ముందే రానా పెళ్లి కావడం ఖాయం అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. అందులో ఎలాంటి సందేహంలేదంటున్నారు.
ఈ ముగ్గురూ తాజాగా ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ టీవీ షోలో పాల్గొన్నారు. వీరంతా గతంలో బాహుబలి సినిమా సమయంలో కలసి పనిచేసిన సంగతి తెలిసిందే. బాహుబలి నార్త్ ప్రమోషన్ కరణ్ చూసుకున్నారు. ఆ చనువుతో ఆయన టీవీ షోలో పాల్గొన్న ఈ ముగ్గురు అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
సాధారణంగా
మీడియా ముందు మాట్లాడాలంటే
ప్రభాస్ కు తగని సిగ్గు.
అందుకే
అతని ఇంటర్వ్యూలు పెద్దగా
కనిపించవు.
మొత్తానికి
ఈ షో ద్వారా ప్రభాస్ నోరువిప్పాడు.
తాను
ప్రపంచంలోని అతి గొప్ప
బద్దకిస్టుల్లో ఒకడినని..
బద్దకం
తన అతి పెద్ద వీక్ నెస్ అని
ప్రభాస్ చెప్పాడు.