వైసీపీలో జగన్‌లా ఇంటిపోరు ఎదుర్కొంటున్న నేతలు వీరే?

వైసీపీలో చాలా మంది నేతలకు ఇంటి పోరు తప్పట్లేదు. సాధారణంగా ఓ నేత ఎన్నికల్లో పోటీ చేస్తే కుటుంబ సభ్యులు సపోర్టు చేస్తారు. మద్దతుగా ప్రచారం చేస్తారు. కానీ చాలా చోట్ల వైసీపీ నేతలకు ఇందుకు భిన్నంగా ఇంటి నుంచే పోరు మొదలవుతోంది. ఏపీ సీఎం జగన్‌కు సొంత చెల్లెలు షర్మిలతో పాటు మరోసోదరి సునీత.. చెవిలో జోరీగల్లా తయారైన సంగతి తెలిసిందే. మా కుటుంబాన్ని చీల్చింది జగనన్నే.. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మే అని జగన్‌ సోదరి షర్మిల ఇప్పటికే కుండబద్దలు కొట్టారు.

జగన్‌ మరో సోదరి, సునీత వివేకా హత్య కేసుపై పోరాడుతున్నారు. కేసులో అసలు నిందితులను జగన్‌ కాపాడుతున్నారంటూ, జగన్‌ వల్ల తన కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ ప్రజల్లోకెళ్లి వివరిస్తున్నారు. వైఎస్‌ వివేకా భార్య సౌభాగ్యమ్మ కూడా జగన్‌... తమ కుటుంబాన్ని మోసం చేశారంటున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై ఆయన రెండో అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ వీడియో సందేశాల ద్వారా పోరాడుతున్నారు. మా మామ లాంటి వారికి ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.

అటు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మోసం చేశారని... ఆయన కుమారుడు రవికుమార్‌ రోడ్డెక్కారు. తన తల్లి, అక్కనూ పట్టించుకోలేదంటూ బూడి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తూ, తన రెండో భార్య కుమార్తెకు మాడుగుల అసెంబ్లీ టికెట్‌ ఇప్పించుకున్నారు. ఇక చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై ఆయన మేనల్లుడు రమేశ్‌బాబు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరి అదే నియోజకవర్గంలో బరిలోకి దిగారు. నారాయణస్వామి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కాళ్లు పట్టుకునే పదవులు పొందారని... తర్వాత జగన్‌ కాళ్లు పట్టుకొనే ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయ్యారని రమేశ్‌ ఆరోపించారు.

టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌ అన్యాయం చేశారని ఆయన భార్య వాణి ఏకంగా సీఎం జగన్‌ వద్దే పంచాయితీ పెట్టారు. వాణి స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు చూడగా.. వైసీపీ నేతలు నచ్చజెప్పి.. కొన్ని ఆస్తులను వాణి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారని టాక్‌ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: