చంద్రబాబు: మళ్లీ మళ్లీ అదే తప్పు.. గెలుపుకి అడ్డు..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలో గెలుపోవటములనే భయం కనిపిస్తూ ఉన్నది.. అయితే గత కొద్ది రోజుల క్రితం వరకు ప్రతి ఏడాది పేద ప్రజలకు క్రమం తప్పకుండా అందిన పథకాలు ఇప్పుడు ఒక్కసారిగా అందడం లేదు.. ముఖ్యంగా విద్యా దీవెన ,రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఫీజురిమెంబర్స్ ఇతరత్రా వాటిని ప్రజలకు ఇవ్వాలని.. స్క్రీనింగ్ కమిటీ గత కొద్ది రోజుల క్రితమే ఏపీ ఎన్నికల కమిషనర్ కు ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈ విషయం పైన ఎన్నికల కమిషనర్ మాత్రం అంగీకరించలేదట.

దీంతో ఈ నిర్ణయంతో అటు రైతులు ఇటు విద్యార్థుల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది.. ముఖ్యంగా ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం అటు టిడిపి నేతల ఫిర్యాదులు చంద్రబాబుే కారణమని పొలిటికల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.. పేదల పైన చంద్రబాబు చాలా కక్షగట్టారని అందుకే సంక్షేమ కార్యక్రమాలను కూడా అడ్డుపడుతున్నారని పలువురు నేతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా గతంలో కూడా తాను ఇలాంటి పథకాలు అన్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు జగన్ పథకాల కంటే తను రెండింతలు ఎక్కువ ఇస్తానంటే మేనిఫెస్టోలో విడుదల చేశారు.

గడచిన కొద్ది రోజుల క్రితం అవ్వ తాతలకు ఇవ్వాల్సిన పింఛన్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చంద్రబాబు.. మళ్లీ ఇలాంటి సమయంలో ప్రజలకు చేరువయ్యే పథకాల అడ్డు విషయంలో బాబు పేరు వినిపిస్తోంది.. దీంతో ప్రజలు కూడా చంద్రబాబు మళ్లీ అలాంటి తప్పులే చేస్తున్నారు అంటూ ఎద్దేవ చేస్తున్నారు. కచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఎన్నికలలో పడుతుందని కూడా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ పథకాల నగదు జమ అయితే కచ్చితంగా వైసీపీ పార్టీకి ప్లస్ అవుతుందని దురుద్దేశంతోనే చంద్రబాబు ఇలా అడ్డుపడుతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమితో కలిసి చేస్తున్న పనుల వల్ల ఇప్పటికే టిడిపి పార్టీకి సగం డ్యామేజ్ వస్తోందని.. ఇప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలు అడ్డుకోవడం వల్ల ఫలితాల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: