విశాఖ సౌత్: వైసీపీని వణికిస్తున్న వంశీకృష్ణయాదవ్?
•దూసుకుపోతున్న యాదవనేత వంశీకృష్ణ యాదవ్
•వంశీకృష్ణయాదవ్ ఎమ్మెల్యేగా గెలవడం పక్కా
విశాఖ సౌత్ - ఇండియా హెరాల్డ్: ఉత్తరాంధ్రలో విశాఖ సౌత్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీలకమైన నియోజకవర్గంగా మంచి పేరు ఉంది. ఫిషింగ్ హర్బర్, కేజీహెచ్, విశాఖ పోర్టు, జగదాంబ జంక్షన్, ఏవీఎన్ కాలేజీ వంటి ప్రముఖ సెంటర్లు.. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహలక్ష్మి దేవాలయం ఉన్న ప్రాంతం ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గం. 2009 వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ నియోజకవర్గం అంతకు ముందు విశాఖ-1 కింద ఉండేది. ప్రస్తుతం 3 లక్షల ఓటర్లు ఉన్న విశాఖ దక్షిణలో తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ గెలిచింది. ఇక ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి అధికార వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా ఆయనకి ధీటుగా జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్ బరిలోకి దిగారు. వాసుపల్లి బాగా చదువుకున్న అభ్యర్థి అయినా వంశీ కృష్ణ యాదవ్ మాత్రం ఈసారి టఫ్ ఫైట్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఎందుకంటే రాజకీయంగా బాగా అనుభవం ఉన్న నేత ఈయన. వివిధ పార్టీల్లో పని చేసిన అనుభవం ఈయనకు ఉండడం వల్ల ఆ పార్టీల బాల బలాలు గురించి క్లారిటీ ఉంది.
గతంలో వైసీపీ నగర అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణయాదవ్ ఎమ్మెల్యే అవ్వాలనే తన జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు తెలివిగా జనసేన పార్టీలో చేరి విశాఖ దక్షిణ సీటు దక్కించుకున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణ 2009 నుంచి ఎమ్మెల్యే అవ్వాలని కలలు కని ఒకసారి పీఆర్‌పీ నుంచి మరోసారి వైసీపీ నుంచి తూర్పులో పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించి, ఆయనకే టికెట్ ఇవ్వడం ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇస్తామని ఆశచూపి కార్పొరేటర్‌గా పోటీ చేయించిన వైసీపీ, ఆ హామీ నెరవేర్చకపోవడం వల్ల వంశీకృష్ణ జనసేనలో చేరారు. ఈ ఏడాది ఆరంభంలో జనసేన పార్టీలో చేరడం… విశాఖ దక్షిణ నుంచి టికెట్ దక్కించుకోవడం చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. ఈయన పోటీతో వైసీపీలో భయం స్టార్ట్ అయింది. పైగా కూటమి ఓట్ల బలంతో వంశీకృష్ణయాదవ్ ఈ సారి ఎమ్మెల్యేగా విజయం సాధించడం పక్కా అని ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ద్వారా తెలుస్తుంది.