టాక్సిక్: సీన్స్ కట్ చేయండి.. కియారా అద్వానీ రిక్వెస్ట్..!
అయితే ఇటువంటి సందర్భంలోనే సినీ వర్గాలలో ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది.. ఈ చిత్రంలో కియారా అద్వానీ ఫైనల్ కట్ చూసి కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు తెలియజేసినట్లు సమాచారం. కథ డిమాండ్ చేయడంతో కొన్ని బోల్డ్ , ఇంటిమెంట్ సీనులను వెండితెర పైన చాలా ఘాటుగా కనిపిస్తున్నాయంటూ ఆమె ఫీల్ అయిందట. ఈ సన్నివేశాలు తన ప్రస్తుత ఇమేజ్ పైన చాలా ప్రభావం చూపియాలా ఉన్నాయని కియారా అద్వానీ వాటిని తొలగించాలని లేకపోతే నిడివి తగ్గించాలంటు చిత్ర బృందాన్ని కోరినట్లు వినిపిస్తున్నాయి.
అయితే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాత్రం ఈ సినిమా పెద్దల కోసం రూపొందించినటువంటి ఒక అద్భుతమైన కథగా అభివర్ణించారట. సీన్లు కథలో చాలా కీలకమని వాటిని తీసివేస్తే సినిమాలో ఎమోషన్స్ తగ్గిపోతుందని ఆమె భావిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. కెరియర్ ప్రారంభంలో బోల్డ్ పాత్రలు చేసినప్పటికీ వివాహం తర్వాత కియారా తన ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. అయితే ఇప్పుడు టాక్సిక్ సినిమాలోని సన్నివేశాలు ఆమె నిర్ణయాన్ని సవాల్ చేసేలా కనిపించబోతున్నాయి. మరి ఈ విషయం పైన అటు చిత్ర బృందం ఎలా స్పందిస్తుంది ,మరి కియారా అడిగిన సీన్స్ ని తీసివేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. డైరెక్టర్ గీతూ, హీరో యష్ మాత్రం ఈ సినిమా పైన చాలా నమ్మకం గానే ఉన్నట్లు తెలుస్తోంది.