దేవర 2 షూటింగ్ మొదలు అప్పుడేనా..?
తాజాగా దేవర సిక్వెల్ పైన వస్తున్న వార్తలన్నిటిపై కొరటాల శివ చెక్ పెట్టేలా తెలియజేసినట్లు వినిపిస్తోంది. బాలకృష్ణ సినిమాతో అనౌన్స్మెంట్ చేయగా దేవర 2 ఉండదనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని కథను ఎన్టీఆర్ కి కూడా వినిపించారని ఆయనకు కూడా బాగా నచ్చడంతో ఓకే అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇద్దరు కూడా తమ తమ చిత్రాలతో బిజీగా ఉండడం వల్లే కొంత ఆలస్యం అవుతుంది తప్ప ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదని తెలియజేశారట.
బాలకృష్ణ, కొరటాల శివ సినిమా 2027 జనవరి నాటికి పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా అవ్వగానే కొరటాల శివ తన ఫోకస్ మొత్తం కూడా దేవర 2 సినిమా పైన పెట్టబోతున్నారు. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ క్రేజీ సీక్వెల్ కూడా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా అప్పటికి తన కమిట్మెంట్ సినిమాలను పూర్తి చేసి ఫుల్ ఫోకస్ దేవర 2 సినిమా పైన పెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. దీంతో అభిమానులు ఈ విషయం విని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈసారి మాత్రం దేవర 2 విషయంలో పక్క ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారు.