చేతులు మారిన జననాయగన్ ఓటిటి హక్కులు..!
ఈ సినిమా వాయిదా పడిన తర్వాత ఇప్పటికీ ఈ సినిమా కొత్త విడుదల తేదీ పైన అధికారికంగా ప్రకటన వెలుబడలేదు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటిటి డీల్ కు సంబంధించిన ఒక వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమా ఓటిటి హక్కులను ముందుగా అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నప్పటికీ ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఈ ప్రాజెక్టు చేయి జారిపోయినట్లు వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ స్థానంలో జీ5 సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయమైతే ఇప్పుడు వైరల్ గా మారింది.
జి5 ఈ సినిమాకి సుమారు రూ .50 కోట్ల వరకు ఆఫర్ చేసిందని అందుకే మేకర్స్ , జి5 బృందం మధ్య చర్చలు కొనసాగుతున్నాయని త్వరలోనే ఒప్పందం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ పొలిటికల్ కారణంగానే ఈ సినిమా ఆలస్యం అయినట్లు వినిపించింది. మరి అన్ని అడ్డంకులను తొలగించుకొని ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి మరి. ఇటీవల తమిళనాడు ఎన్నికలలో కూడా విజయ్ అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ నేతలను పోటీ చేయించారు. మరి పొలిటికల్ పరంగా ఏ విధంగా సక్సెస్ అవుతారో చూడాలి మరి.