ఆ ముదురు హీరోయిన్.. పెళ్లయ్యాకా బికినీలో హల్ చల్..

Chakravarthi Kalyan

ఆమె ఓ ముదురు హీరోయిన్.. 2001లో ఇష్టం సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆపై అంచెలంచలుగా ఎదిగి సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా నటించింది. 18 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ ఉన్న ఆ అందాల హీరోయిన్ ఇటీవలే పెళ్లి చేసుకుంది.


ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ.. ఆమే శ్రియాసరన్.. హీరోయిన్లకు పెళ్లయితే ఆఫర్లు తగ్గిపోవడం సహజమే కదా.. అందుకే ఆమె చడీచప్పుడు కాకుండా మార్చిలో పెళ్లి చేసుకున్నా.. అందరికీ విషయం తెలిసిపోయింది. తన రష్యన్ బాయ్ ప్రెండ్ అండ్రెల్ కొశ్చెవ్ ను పెళ్లి చేసుకున్నాక అవకాశాలు తగ్గాయి.


దీంతో ఈ అమ్మడు ఇప్పుడు ఫారిన్ టూర్లతో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది. ఎంజాయ్ చేయడమే కాదు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచుంది. స్పెయిన్ లోని అందాల బీచ్ లో స్నేహితులతో సందడి చేస్తున్న శ్రియా ఫోటోలు ఆసక్తిరేపుతున్నాయి. బికినీతో అలరిస్తున్న ఈ అమ్మడు తనకింకా గ్లామర్ తగ్గలేదని పరోక్షంగా నిర్మాతలకు సంకేతాలిచ్చేస్తోంది. మరి నిర్మాతలూ గమనిస్తున్నారా..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: