రజినీకాంత్ సిగరెట్ స్టైల్ ఆయన్ని చూసి నేర్చుకున్నారట!

siri Madhukar
తమిళ సినీ అభిమానులకు ఆరాధ్య దైవంగా ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘2.0’మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  రజినీ స్టయిల్, ప్రత్యేకమైన మేనరిజంతో  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.  డైలాగులతో పాటు రజనీ సిగరెట్ ముట్టించే స్టయిల్ కూడా ఒకటి. తాను నటించిన పలు సినిమాల్లో ఈ ‘సిగరెట్ సిగ్నేచర్ మూమెంట్’ను రజనీ మొదలు పెట్టారు. అప్పటి నుంచి రజినీకాంత్ ఏం చేసినా స్టైల్ గా చేయడం మొదలు పెట్టడం..దానికి మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడం జరిగింది.  


తాజాగా రోబో 2.ఓ సినిమాలో సైతం రజనీ ఈ ఫీట్ చేయడంతో థియేటర్లు అభిమానుల కేకలు, అరుపులతో మార్మోగాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...ఈ స్టయిల్ ను తాను బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా దగ్గర నేర్చుకున్నట్లు రజనీకాంత్ తెలిపారు.  ఓసారి చూశాక తాను బాగా ప్రాక్టీస్ చేసి, దానికి తన మేనరిజాన్ని దానికి జోడించానని వెల్లడించారు. ఇది ప్రేక్షకులతో పాటు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. 


అయితే సిగరెట్ స్టైల్ గా నోట్లో వేసుకోవడం అంత ఈజీ కాదని..టైమింగ్, సందర్భం లాంటివి చాలా అవసరమని రజనీ వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు.. “మీకు నచ్చిన బెస్ట్ ఫీమేల్ కో స్టార్ ఎవరు?” అనే ప్రశ్న ఎవరూ ఊహించని విధంగా రజనీ “ఫటా ఫట్ జయలక్ష్మి” అనే పేరు చెప్పారు. తనకి నచ్చిన బెస్ట్ హీరోయిన్ ఆమేనని అన్నారు.  


జయప్రద నటించిన 'అంతులేని కథ' సినిమాలో లైఫ్ ని జాలీగా గడిపే అమ్మాయిగా ఫటాఫట్ జయలక్ష్మి నటించింది..ఈ సినిమాలో ఆమె 'ఫటా ఫట్' అంటూ ఉంటుంది. ఆ మేనరిజం జనంలోకి బాగా వెళ్లడంతో ఆమె ‘ఫటా ఫట్ జయలక్ష్మి’గా పేరొచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించింది.  అయితే ఫటాఫట్ జయలక్ష్మి జీవితం మాత్రం విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: