మళ్లీ విజయ్, రష్మిక కెమిస్ట్రీ.. అర్జున్ రెడ్డి తరహా సెన్సేషన్..?

Chakravarthi Kalyan

అర్జున్ రెడ్డి.. ఈ సినిమా కుర్ర హీరో విజయ్ దేవరకొండ కేరీర్ ను ఎలా మలుపు తిప్పిందే సినీ అభిమానులుకు తెలిసిందే. మెడికో లవర్ పాత్రలో అర్జున్ నటించాడనే కన్నా పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పొచ్చు. పెళ్లి చూపులుతోనే అలరించినా.. అర్జున్ రెడ్డితో నే ఎలాంటి పాత్ర అయినా విజయ్ మెప్పించగలడని అందరికీ గురి కుదిరింది.


మరి అలాంటి వైద్య విద్యార్థి పాత్రను విజయ్ మరోసారి పోషించబోతున్నాడా.. అంటే.. అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. విజయ్ తాజాగా డియర్ కామ్రెడ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండ మొదటి 100 కోట్ల సినిమా గీత గోవిందంలో హీరోయిన్ రష్మికయే ఇందులోనూ హీరోయిన్ గా నటిస్తోంది.


ఈ సినిమా షూటింగ్ కాకినాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో జరుగుతోందట. మరి ఇందులో విజయ్ పాత్ర ఏంటన్నది పూర్తిగా తెలియకపోయినా మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. హీరోయిన్ రష్మిక మాత్రం క్రికెటర్ రోల్ ప్లే చేస్తోందట.


 అందుకే చిన్న బడ్జెట్ సినిమా అయినా వసూళ్ల సునామీ సృష్టించింది. ఐతే.. ఓసారి క్లిక్ అయిన పాత్ర మరోసారి అంత క్రేజ్ సంపాదించడం కష్టమే. మరి ఈ సినిమాలో విజయ్ పాత్ర ఏంటి.. విజయ్, రష్మిక జంట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: