టాలీవుడ్ లోకి ‘దేవదాసు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే రామ్ నటించిన సినిమాల్లో దేవదాస్ తర్వాత రెడీ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ రెండు సినిమాలు మినహా రామ్ నటించిన మిగతా సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోలేక పోయాయి..కానీ ఇండస్ట్రీలో మాత్రం మంచి ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రామ్.
ఆ మద్య కీర్తి సురేష్ హీరోయిన్ గా రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’మంచి సక్సెస్ సాధించింది.
ఒక రకంగా చెప్పాలంటే..ఇండస్ట్రీలో రామ్ కెరీర్ ఒక హిట్.. ఒక ఫట్ అన్నట్టుగా సాగింది. కానీ ఇటీవల వచ్చిన ‘హలో గురు ప్రేమ కోసమే..’ సినిమా సక్సెస్ టాక్తో మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. ప్రస్తుతం రామ్ ఈ చిత్రం విజయాత్రలతో సరదాగా గడిపేస్తున్నాడు. ఈ మద్య మీడియాతో మాట్లాడుతూ..ఈ మద్య మా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒక్కటే తొందర పెడుతున్నారు.
హీరోగా మంచి పేరు వచ్చింది కదా..ఇంకా పెళ్లికి ఆలస్యం ఎందుకు అంటున్నారు. ఎప్పుడూ సినిమాలే అంటావు. సినిమాలతోనే జీవితం గడిపేస్తున్నావు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు మా కుటుంబ సభ్యులు అడుతూనే ఉన్నారు. అయితే వాళ్లు అడుగుతున్నంత సేపు సీరియస్ గా వింటూ ఉంటానని..ప్రస్తుతం ఏమీ మాట్లాడొద్దు.. సినిమా అయిపోగానే పెళ్లి విషయాన్ని చర్చిద్దామని దాటవేస్తుంటా...పెళ్లి ప్రస్తావన వచ్చినపుడల్లా ఇలాగే చేస్తానని అంటున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్.