ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాహుబలి రివర్స్ టెక్నిక్!

Seetha Sailaja
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన స్క్రీన్ ప్లే విషయంలోదర్శకుడు  క్రిష్ ‘మహానటి’ స్కీమ్ ను యథాతథంగా ఫాలో అయిపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ భార్య బసవతారకం ఎన్టీఆర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాష్ బాక్ లోకి వెళ్లిపోతుందని సమాచారం. 

ఇది అంతా ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వ్యవహారం అయితే ఇప్పుడు మార్కెటింగ్ విషయంలో ఈబయోపిక్ ‘బాహుబలి’ మార్కెటింగ్ అడుగుజాడలను పూర్తిగా అనుసరిస్తోంది అన్నవార్తలు వస్తున్నాయి.  ‘బాహుబలి’ మార్కెటింగ్ ను దర్శకుడు రాజమౌళి ప్రారంభించినప్పుడు అతడి సన్నిహితుడు సాయి కొర్రపాటి ముందుగా ఏదో ఒక ఏరియాకు భారీ రేట్లకు కొన్నట్లుగా ప్రచారం చేసేవారు. అయితే ఆరేట్ మార్కెట్ అంచనాలకు మించి ఉన్నా మెల్లగా ఆరేటు ప్రాతిపదికగానే మిగిలిన ఏరియాలుకు అమ్మడం రాజమౌళి అనుసరించిన వ్యూహం.   

ఇప్పుడు అదే టెక్నిక్ ఎన్టీఆర్ బయోపిక్ కు అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీకిసంబంధించి ఉత్తరాంధ్ర మూడుజిల్లాలకు కృష్ణాజిల్లా కలిపి 11.40 కోట్లకు ఒక ప్రముఖ బయ్యర్ కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రాంతం అంతా కలిపి 30కోట్ల రేషియోలో అమ్మినట్లు అంచనా వేస్తున్నారు. 

దీనితో కేవలం ఆంధ్ర ప్రాంతానికి  ఎన్టీఆర్ బయోపిక్  అమ్మితే నైజాంలో 18కోట్లుకు ఈమూవీని అమ్మినా అశ్చర్యం లేదు అని అంటున్నారు.  దీనికితోడు సీడెడ్ ఓవర్సీస్ శాటిలైట్ బిజినెస్ ను కలుపు కుంటే ఎన్టీఆర్ బయోపిక్ కు సుమారు 70 కోట్ల బిజినెస్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నా. అయితే  సంక్రాంతికి విడుదలకాబోతున్న ఈబయోపిక్ సోలోగా విడుదల  కాకుండా    చరణ్ బోయపాటి మూవీ అనిల్ రావిపూడి-వెంకీ-వరుణ్ తేజ్ మూవీలతో పోటీ పడుతున్న నేపధ్యంలో ఏ ధైర్యంతో ఈస్థాయి బిజినెస్ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో జరుగు తోందో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: