భరత్ అనే నేను...రంగస్థలం...ఫినిష్ ...ఇప్పుడు బాహుబలి వైపు... గీత గోవిందం చూపు...


ఐదు సినిమాల్లో నటించిన అనుభవం కూడా సరిగా లేదు కాని సూపర్ స్టార్ స్టేటస్ను కూడా అధిగమించిన యువనటుడు విజయ్ దేవరకొండ. ఒక సినిమా ₹ 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా అదీ పన్నెండు రోజుల్లో ₹100 కోట్ల వసూళ్ళు సాధించటం ఊహాతీతం. మన స్టార్ హీరోలు కుడా ఈ ఫీట్ సాధించ లేదు. అంతెందుకు పవన్, మహెష్ లకు కూడా ఈ విజయం దుర్లభం. దటీజ్ విజయ్ దేవరకొండ అనిపించాడు.  


410 థియేటర్లలో 25వ రోజును పూర్తి చేసుకుంటోంది  గీత గోవిందం అదీ విజయ విజయవిహారం చేస్తూ. తెలుగునాట ఈ సినిమా 304 థియేటర్లలో ఆడుతోందని, మిగతా 104 దియేటర్లు రెస్టాఫ్ ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితం అవుతోందని దీని దర్శక నిర్మాతలు ప్రకటించారు.

 

ఈ ఏడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తున్న ‘గీతగోవిందం’మరో రికార్డును అందుకుంది. నేటితో 25 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా అత్యధిక థియేటర్లలో ప్రదర్శితం అవుతూ అరుదైన రికార్డును సాధించింది. గతదశాబ్దకాలంలో ఏ సినిమా కూడా ప్రదర్శితంకాని రీతిలో, గీతగోవిందం అత్యధిక థియేటర్ల లో వసూళ్ళు వర్షం కురిపిస్తూ ప్రదర్శితమవుతోంది.

25వ రోజుకు ఈ సినిమా ఏకంగా 410 సెంటర్లలో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. తెలుగు సినిమాల వసూళ్ల ధాటి కేవలం వారం పది రోజులకు మాత్రమే పరిమితం అయిపోయిన ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా 25వ రోజుకు ఇన్ని థియేటర్లలో నిలబడటం అంటే మాటలు కాదు. ఇది ‘గీతగోవిందం’ సినిమాకు మాత్రమే సాధ్యం అవుతున్న ఫీట్.

 

ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో సంచలనాలు నమోదు చేసింది. వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను, అరవై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల ధాటి కొనసాగుతూ ఉంది. పోటీకి చాలా సినిమాలే వచ్చినా ‘గీతగోవిందం’ మాత్రం తన సత్తాను చూపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: