జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుకు కోర్టు కీలక ఆదేశం..!

Divya
టాలీవుడ్ హీరో మోహన్ బాబు గత కొద్దిరోజులుగా ఆస్తులకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మోహన్ బాబు పైన కూడా తన చిన్న కుమారుడు మంచు మనోజ్ కూడా కేసు వేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇంటి వద్దకే వచ్చి తన కుమారుడు రచ్చ చేయడంతో కొంతమంది మీడియా మిత్రులను కూడా ఇంటి లోపలికి అనుమతించారు. దీంతో మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయినప్పుడు ఒక మీడియా రిపోర్టర్ పైన మోహన్ బాబు చేయి చేసుకోవడం జరిగింది.దీంతో మోహన్ బాబు పైన కేసు కూడా వేశారు.

మైక్ తో కొట్టడంతో ఈ వివాదం ఒక్కసారిగా వైరల్ గా మారింది. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బయలు కూడా కోరగా దీంతో సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ సైతం దాఖలు చేశారు మోహన్ బాబు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసు  పైన సుప్రీంకోర్టు తదుపరి విచారణకు సైతం మోహన్ బాబు పైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటూ పలు రకాల ఉత్తర్వులను జారీ చేసిందట. అలాగే నాలుగు వారాలకు కేసు వాయిదా వేయడం జరిగింది. అలాగే మూడు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలి అంటూ కూడా ప్రతి వాదనలకు నోటీసులను జారీ చేసింది.

అయితే నష్టపరిహారం కావాలా? లేకపోతే జైలుకు పంపించాలా అనే విషయం పైన ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలను క్లారిటీగా స్పష్టం చేయాలి అంటూ సుప్రీంకోర్టు తెలియజేసింది. తదుపరి విచారణలో భాగంగా జడ్జిమెంట్ ఇస్తామంటూ ధర్మాసనం తెలిపింది. అలాగే ఇంటి లోపలికి వచ్చినంత మాత్రాన కూడా జర్నలిస్టుల పైన దాడి చేస్తారా అంటూ మోహన్ బాబు తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి ధర్మాసనం ప్రశ్నించగా? అయితే తన కొడుకుతో గొడవలు సందర్భంగా ఈ ఘటన జరిగిందని జర్నలిస్టు పైన జరిగిన దాడికి క్షమాపణలు కూడా బహిరంగంగా చెప్పారని..నష్టపరిహారం చెల్లించేందుకు కూడా వారు సిద్ధంగానే ఉన్నారని తెలిపారు. 76 ఏళ్ల వయసులో ఉన్న తాను కావాలని ఇలాంటి దాడి చేయలేదని ఆవేశంలో జరిగిందని తెలిపారు.. మోహన్ బాబు మాత్రం జర్నలిస్టులు తన ఇంట్లోకి ట్రేస్ పాస్ చేశారని కూడా కోర్టుకు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: