కన్నడ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారి లో యాష్ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభం లో ఎన్నో కన్నడ సినిమా లో నటించి మంచి విజయాలను అందుకొని కన్నడ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే కొంత కాలం క్రితం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన కే జి ఎఫ్ సిరీస్ మూవీ లలో హీరో గా నటించాడు . ఈ మూవీ పాన్ ఇండి యా సినిమా గా చాలా భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించడం తో యాష్ కి ఈ మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది.
ఇక కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ తర్వాత ఈయన చాలా కాలం పాటు ఏ సినిమాను కూడా ఓకే చేయకుండా ఉన్నాడు. ఇక కొంత కాలం క్రితమే ఈయన టాక్సిక్ అనే సినిమాను ఓకే చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఈ గ్లిమ్స్ వీడియోకు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
ఇకపోతే 24 గంటల సమయం ముగిసే సరికి ఈ మూవీ గ్లిమ్స్ వీడియోకు 36 మిలియన్ వ్యూస్ , 550 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా గ్లిమ్స్ వీడియోకు వచ్చిన వ్యూస్ ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు 24 గంటల్లో రాలేదు. దానితో ఈ మూవీ గ్లిమ్స్ ఆల్ టైమ్ రికార్డు ను సృష్టించింది.