మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ చరణ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన చరణ్ కు జోడిగా అంజలి కనిపించనుండగా , కొడుకు పాత్రలో నటించిన చరణ్ కి జోడిగా కియార జోడిగా కనిపించబోతుంది. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాను రేపు అనగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ చాలా దగ్గర పడిన తెలంగాణ రాష్ట్రంలో టికెట్ రైట్స్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నుండి జీవో రాకపోవడంతో నిన్నటి వరకు ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ కాలేదు. ఇక నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్రం నుండి టికెట్ ధరల పెంపుపై జీవో రావడంతో ఈ రోజు ఉదయం నుండి పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో టికెట్ బుకింగ్లు ఓపెన్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో కేవలం 60 నిమిషాల సమయంలోనే ఒక కోటి గ్రాస్ కలెక్షన్స్ ఈ మూవీ కి వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.