ప్రభాస్ ఉదారతను బయటకు చెప్పిన కేరళ మంత్రి !

Seetha Sailaja
కొన్నిరోజుల క్రితం కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు వరదలు వల్ల వేలకొట్లలో నష్టం జరిగింది. సర్వం కోల్పోయి అనాథలు అయినవారు వేలసంఖ్యంలో ఉన్నారు. ఇలాంటి వారుకోసం సహాయం చేయడానికి ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నా ప్రజల అభిమానంతో స్టార్  గా మారి కోట్లు సంపాదించుకున్న టాప్ హీరోలు కేరళ వరద బాధితుల కోసం ఏమి ఇచ్చారు అన్న ప్రశ్న ఉదయించడంతో టాప్ హీరోలు అంతా ఎవరికి వారు తమకుతోచిన సహాయం అందించారు.

ఈ పరిస్థుతులలో ఈవైపరీత్యం పట్ల సానుభూతి వ్యక్తపరుస్తూ మన టాప్ హీరోలు కూడ ముందు వరసలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కేరళ టూరిజం శాఖమంత్రి కడకంపల్లి సుందరేశన్ మాట్లాడుతూ మలయాళ నటులు పెద్దగా విరాళాలు ఇవ్వకపోవడం పై మండి పడుతూ మలయాళ సినిమా రంగంలో టాప్ హీరో కానప్పటికీ టాలీవుడ్ హీరో ప్రభాస్ ఒక కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చిన విషయం బయటపెడుతూ ప్రభాస్ ఉదారతను చూసి మళయాళ ఫిలిం ఇండస్ట్రీ నేర్చుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

వాస్తవానికి ప్రభాస్ కేరళా బాధితుల కోసం 25 లక్షలు విరాళం ఇచ్చాడని టాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా కేరళా ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి ఈ ప్రకటన చేసాడు అని వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులు అతడి ఉదారతను మెచ్చుకుంటూ పొగడ్తలతో అభినందనలు తెలియచేస్తున్నారు. 

ప్రభాస్ చేసిన ఈ సహాయం ఇలా ఇప్పుడు బయటపడటంతో ‘సాహో’ మూవీకి కేరళా రాష్ట్రంలో కూడ మంచి బిజినెస్ జరగడంతో పాటు భారీ కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న ప్రభాస్ ఇప్పుడు మాలీవుడ్ లో కూడ రానున్న రోజులలో క్రేజీ హీరోగా ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: