సైరా క్లైమాక్స్ లో అల్లూరిసీతారామరాజు !

Seetha Sailaja
అత్యంత భారీ బడ్జెట్ లో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న ధ్యేయంతో నిర్మింపబడుతున్న ‘సైరా’ మూవీ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజునాడు విడుదలైన ఈమూవీ టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో ఈమూవీకి సంబంధించిన పనుల పై మరింత శ్రద్ధ పెట్టి వచ్చే సమ్మర్ కు ఎట్టి పరిస్తుతులలోను ‘సైరా’ విడుదల చేయాలి అన్న ధ్యేయంతో చిరంజీవి చరణ్ లు అడుగులు వేస్తున్నారు. 

వాస్తవానికి ఈసినిమా కథ 18వ శతాబ్దంలోని ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ జీవితంలో కావడంతో అతడి జీవితానికి సంబంధించి చారిత్రక ఆధారాలు చాల తక్కువగా ఉన్నాయి. దీనితో అనేక కల్పనలు సృష్టించి ‘సైరా’ కథలో మార్పులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

చరిత్రకారుల కథనాల ప్రకారం ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ తలను నరికి అలనాటి బ్రిటీష్ వారు నరసింహా రెడ్డి కోటకు వేళ్ళాడతీసారు. ఇప్పుడు యథాతధంగా ఈమూవీ క్లైమాక్స్ లో అటువంటి సీన్ పెడితే చిరంజీవి అభిమానులు అంగీకరించరు కాబట్టి ‘సైరా’ క్లైమాక్స్ ఎలా తీయాలి అన్న చర్చలకు ఒక పరిష్కారం దొరికినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈమూవీ క్లైమాక్స్ లో నరసింహా రెడ్డి పాత్రను పోషిస్తున్న చిరంజీవి తల నరికే సీన్ పెట్టకుండా నరసింహ రెడ్డి స్ఫూర్తి తో ఎవరెవరు తిరుగుబాటు చేశారు ? స్వాతంత్ర పోరాటంలో ఈ నరసింహరెడ్డి ప్రభావం ఎంత వరకు దోహద పడింది అన్న విషయాలను వాయస్ ఓవర్ లో వివరిస్తూ ‘ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి’ తరవాత పుట్టుకొచ్చిన భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవ వీరుల్ని తెరపై మాంటేజ్ షాట్లలో చూపిస్తూ ఈమూవీ క్లైమాక్స్ కు ముగింపు ఇవ్వాలని ఒక స్థిర నిర్ణయానికి మెగా కాంపౌండ్ వచ్చినట్లు టాక్. అంతేకాదు ఈ వాయస్ ఓవర్ ను పవన్ కళ్యాణ్ చేత ఇప్పించి మరో సంచలనం సృష్టించాలని చరణ్ ఆలోచన అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: