సమంతకు కోచ్ గా మారిన బన్నీ !

Seetha Sailaja
అల్లు అర్జున్ అదేవిధంగా సమంత ఇప్పటికే స్థిరపడిపోయిన టాలీవుడ్ ఫిలిం సెలెబ్రెటీలు. వీరిద్దరికీ లక్షల సంఖ్యలో సోషల్ మీడియాలో అభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో సమంతకు అల్లు అర్జున్ కోచ్ గా మారబోతు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

తమ అభిమానులతో నిరంతరం సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ హడావిడి చేయడం అల్లు అర్జున్ సమంతల అలవాటు. వారి సినిమాల గురించి మాత్రమే కాకుండా వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక విషయాలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానులతో నిరంతర సాన్నిహిత్యం కొనసాగించడం వీరి అలవాటు.

లేటెస్ట్ గా సమంత అల్లు అర్జున్ పై ఒక ట్విట్ చేసింది. బన్నీ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లో ‘యామ్ ఎ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో’ అన్న పాటలోని బన్నీ క్యాప్ తో చేసిన డ్యాన్స్ స్టెప్ గురించి ప్రస్తావిస్తూ తాను అలాంటి స్టెప్ వేయాలని గత మూడు నెలలుగా తన ఇంట్లో ప్రయత్నిస్తున్నా వేయలేకపోతున్న విషయాన్ని బయటపెడుతూ ‘బన్నీ కి నమస్కారం’ అంటూ జోక్ చేసింది. 

ఈ ట్విట్ చూసిన అల్లు అర్జున్ స్పందిస్తూ సమంతకు కృతజ్ఞతలు తెలిపి ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే ఈ స్టెప్ వేయడం చాల సులువు అంటూ సమంత కోరుకుంటే తాను ఆ స్టెప్ విషయంలో కోచ్ గా మారుతాను అంటూ బన్నీ సమంతకు రీ ట్విట్ చేసాడు. దీనితో ప్రస్తుతం వీరిద్దరి మధ్యా జరిగిన ఈ ఫన్నీ ట్విట్స్ ను లైక్ చేస్తూ సమంత అల్లు అర్జున్ అభిమానులు ఒకరికొకరు ఈ ట్విట్స్ ను షేర్ చేసుకుంటున్నారు..  
Samantha Akkineni‏Verified account @Samanthaprabhu2 Aug 14
More
Samantha Akkineni Retweeted
malika
   🍒
This song     I just cannot    I
practised
with a cap for 3
hours .
@alluarjun is the H in
Hardwork
   
Replying to @Samanthaprabhu2
Thank you
Sam
.
Just saw
this .
I don’t mind teaching some tricks :) it’s easier when som1
teaches .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: