కేరళా బాధితులకు అల్లు అర్జున్ విరాళం!

Edari Rama Krishna
కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తుతున్నాయి. ప్రకృతి విలయతాండవానికి పలువురు మృతి చెందగా...వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళలోని ఇడుక్కి సహా పలు జిల్లాల్లో నీట మునిగాయి. విరాళాలిచ్చి కేరళా వరద బాధితులను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పిలుపునిచ్చారు. కేరళా సీఎం పిలుపు మేరకు ఇప్పటికే కోలీవుడ్‌ నుంచి కమల్ హాసన్, విశాల్‌, విజయ్, సూర్య, కార్తీలు కేరళా ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహాయాన్ని ప్రకటించారు.

కమల్ హాసన్ రూ.25 లక్షల విరాళం ప్రకటించగా, సూర్య, కార్తిలు కలిసి రూ.25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు తెలుగు హీరో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ సైతం రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు.  తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25లక్షల విరాళాన్ని ప్రకటించారు. కేరళ పరిస్థితిపై అన్ని భాషల నటులు స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే బన్నీ స్పందించి భూరీ విరాళం ప్రకటించారు. బన్ని నటించిన చిత్రాలు మాలీవుడ్ లో సైతం బాగా ఆడుతాయి..అక్కడ కూడా మనోడియి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కేరళ ప్రజలను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళ ప్రజలకు యావత్ భారత్ అండగా ఉండాలని ఆకాంక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: