అమ్మడికి కో అంటే కోటీ ...అక్కడా తుక్కు రేగ్గొడుతుందట !

Satya
మిల్కీ అందాలతో మిలమిల మెరిసే తమన్నాకు వయసు పెరుగుతున్న కొద్దీ అందం  ఎక్కువవుతోంది. హీరోయిన్ గా ఉంటూనే ఐటం సాంగ్స్ తో అదరగొడుతూ తమ్మూ తడఖా చూపిస్తోంది. తెలుగులో ఈ సుందరి ఐటం నంబర్లతో స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకుంది. ఈ మధ్య వచ్చిన యంగ్ టైగర్ జై  లవకుశ మూవీలో స్వింగ్ జర ...స్వింగ్ జర అంటూ యూత్ ని ఓ ఊపు ఊపేసింది. ఆ ఒక్క సాంగ్ కి దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చింది. 


అక్కడా ఇరగ్గోట్టేసింది :


అల్లుడు శీనూ  అంటూ బెల్లంకోండ వారసుడితో ఓ ఐటం నంబర్లో  కనిపించి కుర్ర కారును పూర్తిగా పడేసింది. ఇలా అప్ కమింగ్ హీరోలకూ తన అందం, డాన్స్ లతో లైఫ్ ఇచ్చిందీ బ్యూటి. ఇక లేటెస్ట్ గా తమ్మూకు కళ్ళు చెదిరే ఆఫర్ ఒకటి వచ్చిందట. ఆ ఆఫర్ చూసి తోటి హీరోయిన్లు కుళ్ళుకుంటున్నారుట.



కన్నడంలో మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో తమ్మూ క్రేజీ ఆఫర్ ని సొంతం చెసతుంది. జాగ్వార్ ఫేం నిఖిల్ గౌడకు సన్నిహితుడైన అప్  కమింగ్  టాలెంట్ యశ్ మూవీలో ఈ అమ్మడు ఐటం సాంగ్ చేయబోతోంది. తెలుగు, తమిళ్, మళయాళం, హిందీలలో తీస్తున్న ఈ మూవీలో యశ్ పక్కన ఐటం సాంగ్ చేయడానికి తమ్మూకి అక్షరాలా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారు.




ఈ దెబ్బతో తమ్మూ టాలెంట్ ఏంటో సౌత్ ఇండియా మొత్తం మరో మారు తెలిసిపోయింది. తమ్మూకి హీరోయిన్ గా కంటే ఐటం నంబర్లే బాగా వర్కౌట్ అవుతున్నాయి. చూద్దాం తమ్మూ అక్కడ  ఇంకెంత మ్యాజిక్ చేస్తుందో, మరెంత మంది మతి పోగొడుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: