పూరిజగన్నాథ్ ఆగ్రహంలో పవన్ వీరాభిమాని

Seetha Sailaja
పూరిజగన్నాథ్ కు దర్శకుడుగా ఒక లైఫ్ ను ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని పవన్ వీరాభిమానుల అభిప్రాయం. 2000 సంవత్సరంలో విడుదలైన ‘బద్రీ’ సినిమాతో పూరి క్రేజీ డైరెక్టర్ గా మారిపోవడం వెనుక పవన్ మ్యానియా ఎంతగానో సహకరించింది. ఈమధ్య పవన్ వీరాభిమానులలో ఒకరు పూరి జగన్నాథ్ ను టార్గెట్ చేస్తూ యూట్యూబ్ లో ఒకవీడియో అప్ లోడ్ చేసాడు. ఈవీడియోలో ఆపవన్ వీరాభిమాని పూరిమీద దారుణమైన కామెంట్స్ చేసాడు. 

పవన్ అవకాశం ఇవ్వడం వల్లనే పూరి క్రేజీ డైరెక్టర్ గా మారి చాలామంది టాప్ హీరోలతో సినిమాలు చేసాడని కామెంట్ చేసాడు. అయితే అటువంటి పూరి పవన్ ‘జనసేన’ పార్టీ పెడితే కనీసం మాటలతో మద్దతు కూడ పలకలేదు అంటూ పూరి పై ఆగ్రహంతో ఆవీరాభిమాని ఆవీడియోలో చెలరేగిపోయాడు. దీనితో పూరీని టార్గెట్ చేస్తూ పవన్ అభిమానులు కామెంట్స్ పెట్టడం గత కొద్దిరోజులుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈవిషయాలు పూరిజగన్నాథ్ టీమ్ వరకు చేరడంతో పూరీ వద్ద అసిస్టెంటుగా పని చేసిన ఒకవ్యక్తి పవన్ కళ్యాణ్ అభిమానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 

పూరి గురించి పవన్ అభిమానులకు ఏమితెలుసు అని ప్రశ్నిస్తూ పూరి అనేక సందర్బాలలో జరిగిన ఆడియో ఫంక్షన్స్ లో పవన్ వ్యక్తిత్వం గురించి పొగిడిన సందర్భాలు తెలియవా? అంటూ పూరి అసిస్టెంట్ పవన్ అభిమానులను ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు పవన్ పై అతడి అభిమానులకున్న ప్రేమకన్నా పూరీకి అభిమానం చాలఎక్కువ అనీ పవన్ కళ్యాణ్ వీరాభిమానుల వల్లే పవన్ కు చెడ్డపేరు వస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు పూరి సన్నిహితుడు. 

అంతేకాదు ఈమధ్య పవన్ కళ్యాణ్ ఆర్జీవి ఇష్యూ జరిగినపుడు పవన్ కళ్యాణ్‌ కు సపోర్టుగా ట్వీట్ చేసిన మొదటి వ్యక్తి పూరి అంటూ ‘నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ బాధపడటం నాకూ బాధ కలిగించింది. ఆర్జీవి చేసిన పని నాకు నచ్చలేదు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ఉంటాను' అని పూరి చేసిన ట్విట్ ను పవన్ అభిమానుల దృష్టికి తీసుకువస్తూ  ‘జనసేన’ ను సపోర్ట్ చేయనివారు అంతా పవన్ కు శత్రువులేనా అంటూ కౌంటర్ ఇచ్చాడు పూరి యూనిట్ లోని ఆవ్యక్తి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: