మెగా అల్లుడు ‘విజేత’ సెన్సార్ పూర్తి!

Edari Rama Krishna
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ మొదటి సినిమాగా .. రాకేశ్ శశి దర్శకత్వంలో 'విజేత' సినిమా రూపొందింది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ యూ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. సాధారణంగా కొత్త హీరోతో సినిమా అంటే మహా అయితే రెండు మూడుకోట్లు పెడతారు. లేదా వారసుల సినిమా అంటే స్వంతంగా ఎంతయినా, ఎన్నికోట్లు అయినా పెడతారు. కానీ నిర్మాత సాయి కొర్రపాటి మాత్రం మెగా అల్లుడు సినిమా కోసం ఏకంగా ఏడుకోట్లు పెట్టడం విశేషం. 

విజేత అనే టైటిల్ లో మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్ తో నిర్మించే సినిమాను ఆరంభంలో చిన్నగా చేయాలనే దిగారు. ప్రారంభంలో మూడు నుంచి నాలుగుకోట్ల ప్రాజెక్టుగా డిజైన్ చేసారు.  సాధారణంగా సాయి కొర్రపాటి తన సినిమాలు తానే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. నైజాం మాత్రం సురేష్ బాబు చేస్తారు. ఈ సినిమా కూడా అలాగే చేస్తారో? మరి విక్రయిస్తారో చూడాలి.

ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ సరసన కథానాయికగా మాళవిక నాయర్ నటించింది. వారాహి చలన చిత్రం బ్యానర్లో తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దంపట్టే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. కల్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో మురళీ శర్మ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో కల్యాణ్ దేవ్ వున్నాడు. ఆయన నమ్మకం నిజమవుతుందేమో చూడాలి మరి. 
Vijetha wraps up censor and gets a clean 'U' *ing #KalyaanDhev, @iamMalavikaNair & @murlisharma72
Directed by @rakeshsashii
Cinematography by @DOPSenthilKumar
Music by #HarshavardhanRameshwar
A @VaaraahiCC Production

Save the date: July 12th#VijethaonJuly12 pic.twitter.com/wJfUJq52En

— VamsiShekar (@UrsVamsiShekar) July 6, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: