180 కోట్ల భారీ బడ్జెట్ తో గుణ శేఖర్ డైరెక్షన్ లో రానా సినిమా..!
రానా హోమ్ బ్యానర్ లోనే సురేష్ బాబు భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోపక్క ఈ సినిమాలో తన పాత్ర కోసం ఇప్పటి నుండే రానా జిమ్ కి వెళ్తున్నట్టు సమాచారం. మరి ముఖ్యంగా ఈ సినిమాలో గుణశేఖర్ విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట..
ఇందుమూలంగా దేశంలో నెంబర్ వన్ ఆర్టిస్ట్ అయిన ముకేశ్ సీంగ్ తో ఇప్పటికే కొన్ని డ్రాయింగ్స్ వేయిస్తున్నారట. వైకుంఠం – ఇంద్రలోకం మరియు హిరణ్యకశ్యప పాత్ర కు సంబందించిన డ్రాయింగ్స్ వేయిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అన్ని అధికారిక ప్రకటనలు పని చేసే విభాగాల గురించి డైరెక్టర్ గుణశేఖర్ తెలియజేస్తారని సమాచారం.