ఆ కమెడియన్ పరిస్థితి ఏంటో ఇప్పడూ... అంత నోటి దూల అవసరమా...!

Prathap Kaluva

షకలక శంకర్ ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. జబర్దస్త్ తో మంచి పేరు సంపాదించి సినిమా లలో ఎన్నో కామెడీ క్యారెక్టర్స్ చేసినాడు. అయితే తను హీరోగా నటించిన ఒక సినిమా వచ్చి రిలీజ్ అయిన సంగతీ తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం తో సినిమా రిలీజ్ కు ముందు శంకర్ చేసిన హంగామా ఇప్పడు తనకు ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పొచ్చు. దీనినే నోటి దూల అని చెప్పవచ్చు. అందరీ మీద విమర్శలు చేసే సరికే  ఇప్పడూ మొదటికే మోసం వచ్చింది.


 ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్, దిల్ రాజుతో పాటు మరికొంతమంది ప్రముఖులపై నానా విమర్శలు చేశాడు. దాన్ని అతడు కామెడీ అనుకున్నాడు. సినిమా ప్రమోషన్ కు కలిసొస్తుందని భావించాడు. కట్ చేస్తే, శంభోశంకర డిజాస్టర్ అయింది. అక్కడితో ఆగదు ఈ వ్యవహారం. ఇప్పుడు కమెడియన్ గా షకలక శంకర్ కెరీర్ కూడా చిక్కుల్లో పడింది. ఇండస్ట్రీలో అతడికి కచ్చితంగా అవకాశాలు తగ్గుతాయి. నోటి దూలతో ఎవర్ని ఏమంటాడో అనే భయం ఇప్పుడు అందర్లో ఉంది. 


'ఎందుకొచ్చిన రిస్క్ అతడి స్థానంలో మరో కమెడియన్ ను తీసుకుంటే పోలా' అనే అభిప్రాయం మేకర్స్ లో కలిగింది. అలా తన అనుచిత వ్యాఖ్యలతో తన కెరీర్ కు తానే పాతర వేసుకున్నాడు షకలక శంకర్. ఇతడు కచ్చితంగా మంచి నటుడే. తనదైన స్టయిల్ లో కామెడీ పండించడంలో దిట్ట. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్. కానీ ఇండస్ట్రీలో టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. ఆ విషయాన్ని షకలక శంకర్ త్వరలోనే గ్రహిస్తాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: