లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. మండపేటలో తోట త్రిమూర్తులు విజేతగా నిలుస్తారా?

Reddy P Rajasekhar
ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2008 సంవత్సరంలో మండపేట నియోజకవర్గంగా ఏర్పడగా టీడీపీకి కంచుకోటగా ఈ నియోజకవర్గానికి పేరుంది. 2009 నుంచి 2019 వరకు వేగుళ్ల జోగేశ్వరరావు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
 
అయితే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయనే చర్చ జరుగుతోంది. ఇంతకాలం పాటు సరైన అభ్యర్థి లేకపోవడం వల్లే మండపేటలో ఆశించిన ఫలితాలు రాలేదని వైసీపీ భావిస్తుండగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఈ నియోజకవర్గం తరపున గిరిజాల వెంకటస్వామి నాయుడు, 2019లో పిల్లి సుభాష్ చంద్రబోస్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
 
తోట త్రిమూర్తులు కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా గుర్తింపును సొంతం చేసుకోగా ఆయన సొంత నియోజకవర్గం రామచంద్రాపురం కావడం గమనార్హం. గతంలో వైసీపీ తోట త్రిమూర్తులును మండపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా నియమించగా ఈ ఎన్నికల్లో మండపేట అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో లోకల్ అభ్యర్థి అయిన జోగేశ్వరరావుకు అనుకూల ఫలితాలు వస్తాయో నాన్ లోకల్ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు అనుకూల ఫలితాలు వస్తాయో చూడాలి.
 
ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉండగా జనసేన మద్దతు ఉండటంతో  ఆ ఓట్లు జోగేశ్వరరావుకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సొంత సామాజిక వర్గం బలం తోట త్రిమూర్తులుకు ప్లస్ కాగా మండపేటలో విసృతంగా పర్యటించడం ఆయనకు ప్లస్ అయింది. ఈ నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: