జీవితంలో అందరూ ప్రేమిస్తారు..కాని కొంత మంది ప్రేమ మాత్రమే సక్సోస్ అవుతుంది. నా జీవితంలో కూడా అలాంటిదే జరిగిందని అంటున్నడు జబర్ధస్త ఫేమ్ గెటప్ శీను. కొంత కాలంగా జబర్ధస్త్ లో సుడిగాలి సుధీర్ గ్రూప్ లో వస్తున్న గెటప్ శీను ఎన్నో రకాల గెటప్స్ తో అదరగొడుతున్నాడు. ఈ మద్య వెండితెరపై కూడా చాన్సులు దక్కించుకుంటున్నాడు.
తాజాగా ఆయన ఓ టీవీ షో లో మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. "నేను ఒక అమ్మాయిని ప్రేమించాను .. ఆమె తమిళనాడులోని 'తిరుప్పూర్' లో ఒక హాస్టల్లో ఉండేది. 15 రోజులకు ఒక్కసారి నానా కష్టాలు పడుతూ ఆమె ఉండే హాస్టల్ కి వెళ్లేవాడిని..అయితే అక్కడ మాత్రం ఒక్కగంట సేపు మాత్రమే మాట్లాడుకోవడానికి చాన్సు ఇచ్చే వారు.
అయితే ఆమె ఊరు వెళ్లాలనుకుంటే మాత్రం నేను హాస్టల్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి ఇద్దరం కలిసి నడుచుకూంటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా వెళ్లే వాళ్లం. బ్యాడ్ లక్ ఆమెను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. పెద్దల మాత్రం ఒప్పుకోలేదు. ఃః
తర్వాత ఆమె పెళ్లి చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు నా భార్య అంతకన్నా ఎక్కువ..నన్ను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఇప్పుడు హ్యాపీగానే వున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.