రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు అడ్డుగా మారిన మగధీర !

Seetha Sailaja
‘బాహుబలి’ తో జాతీయ స్థాయి సెలెబ్రెటీగా మారిన రాజమౌళి తన ఇమేజ్ ను మరింత పెంచుకోవడానికి తాను త్వరలో ప్రారంభించబోతున్న జూనియర్ చరణ్ ల మల్టీ స్టారర్ విషయమై అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ కథ విషయమై తీవ్ర ఆలోచనలు చేస్తున్న రాజమౌళి తన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి 2009 లో తాను దర్శకత్వం వహించిన అప్పటి సంచలన చిత్రం ‘మగధీర’ పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

అప్పట్లో ‘మగధీర’ సంచలన విజయం సాధించినా ‘బాహుబలి’ తో రాజమౌళికి వచ్చిన స్థాయిలో ‘మగధీర’ వల్ల జక్కన్నకు పేరురాలేదు. ఈ సినిమాను దక్షిణ భాషలలో అనువదించినా పెద్దగా అక్కడి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ‘బాహుబలి’ మూవీకి జపాన్ దేశ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన నేపధ్యంలో అనుకోకుండా రాజమౌళి దృష్టి ‘మగధీర’ పై పడినట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు రామ్ చరణ్ కెరియర్ కు సూపర్ టర్నింగ్ ఇచ్చిన ‘మగధీర’ మూవీని జపాన్ భాషలోకి డబ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. చరణ్ జూనియర్ లు తమ తమ సినిమాలలో బిజీగా ఉండటంతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ స్క్రిప్ట్ పై ఇంకా చర్చలు జరుగుతున్న నేపధ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాజమౌళి ఈ గ్యాప్ ను ‘మగధీర’ మూవీని జపనీస్ భాషలో డబ్ చేయడానికి లోతైన చర్చలు చేస్తున్నట్లు టాక్. 

ఈవిషయమై ఇప్పటికే రాజమౌళి ‘మగధీర’ ను తీసిన అల్లు అరవింద్ అనుమతి తీసుకోవడమే కాకుండా ‘బాహుబలి’ ని తీసిన ఆర్కా మీడియా సంస్థతో ‘మగధీర’ జపాన్ భాష డబ్బింగ్ వ్యవహారాలను చూస్తున్నట్లు టాక్. అయితే జపాన్ ప్రజలు పాటలను పూర్తిగా ఇష్టపడరు కాబట్టి అక్కడి ప్రజల అభిరుచి మేరకు ‘మగధీర’ నిడివి తగ్గించి భారీ పబ్లిసిటీతో రాజమౌళి స్వయంగా జపాన్ లో ‘మగధీర’ జపాన్ భాష డబ్బింగ్ ను ప్రమోట్ చేసే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తుంటే ‘మగధీర’ జపాన్ డబ్బింగ్ పనులు ఎంతో కొంత ‘ఆర్ఆర్ఆర్’ పనులకు అడ్డు తగిలినా ఆశ్చర్యం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: