కోపంతో డైరెక్టర్ శంకర్ ని నాలుగు సార్లు పొమ్మాన్నాను : అర్జున్

siri Madhukar
శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన 'జెంటిల్ మేన్' సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది.  పై చదువులు చదివి డాక్టర్ కావాలన్న ఓ విద్యార్థి లంచం కోసం విద్యాశాఖ మంత్రి చేసిన అవమానం తట్టుకోలేక చనిపోతాడు..దాంతో అర్జున్ పెద్ద వాళ్లను మోసం చేసి డబ్బు దోచుకొని  విద్యార్థులకు, ప్రజలకు  ఉపయోగపడేలా ఓ పెద్ద హాస్పిటల్, కళాశాల నిర్మిస్తాడు.  అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతగా ఆ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులపై ప్రభావం చూపింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. న 'జెంటిల్ మేన్' సినిమాలో నటించడం అదృష్టం అని అలాంటి సినిమాలు మళ్లీ రావని అన్నారు.  అయితే ఈ సినిమా తీసే ముందు ఓ సంఘటన జరిగిందట.  ‘జెంటిట్ మేన్’ సినిమాకు ముందు నా సినిమాలు వరుసగా అపజయం పాలయ్యాయి..దాంతో కొంత మంది దర్శర, నిర్మాతలు నన్ను అసలు పట్టించుకోవడమే మానేశారు.  అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇల్లు అమ్మేసుకుని నేనే హీరోగా ఒక సినిమాను నిర్మించాను. ఆ సినిమా బాగా లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా .. మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.

దాంతో మళ్లీ దర్శక నిర్మాతలు క్యూ కట్టడం మొదలుపెట్టారు.  ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది..ఇబ్బందుల్లో ఉన్నపుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు..ఇప్పుడు నా చుట్టు తిరుగుతున్నారని నేను వాళ్లను వెళ్లిపొమన్నాను. ఆ సమయంలో నన్ను ఓ కుర్రాడు కలవడానికి వచ్చాడు.. కోపంతో ఉండడం వలన నాలుగుసార్లు వెనక్కు పంపేశా.

కానీ ఐదవసారి ఆ కుర్రాడే తనవద్దకు వచ్చాడు. ఆ కుర్రాడే శంకర్ .. ఆయన చెప్పిందే 'జెంటిల్ మేన్' స్టోరీ. ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడిందో తెలిసిందే. నా సినిమా ద్వారా శంకర్ పరిచయమైనందుకు నేను ఇప్పటికీ గర్వపడుతుంటాను" అని ఆయన అన్నారు. కథ విన్నాకా నో చెప్పలేకపోయా అని అర్జున్ తెలిపారు.  అంతటి గొప్ప దర్శకుడు నా చిత్రంతో పరిచయం అయ్యాడని ఎప్పుడూ గర్వంగా ఫీలవుతుంటానని అర్జున్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: